కొత్త ప్రపోజల్: స్టిల్ వర్జిన్… ఎనీ టెస్ట్ ఐ యాం రెడీ!

-

ఒకప్పుడు పోస్టర్ పైనా.. బుల్లి, వెండి తెరలపైనా మాత్రమే ప్రేక్షకులకు అభిమానులకు పరోక్షంగా అందుబాటులో ఉండే సినీ జనాలు.. సోషల్ మీడియా పుణ్యమాని చాలా దగ్గరకొచ్చేశారు. ఎంత దగ్గరకంటే… నేరుగా లవ్ ప్రపోజల్ చేసేవరకూ!! అవును… తాజాగా ఒక అభిమాని, బాలీవుడ్ హీరోయిన్ కు ఆన్ లైన్ వేదికగా, డిఫరెంట్ గా పెళ్లి ప్రపోజల్ చేశాడు.

బాలీవుడ్ హీరోయిన్ తిలోత్తమ షోం ‌కు తాజాగా ఒక పెళ్లి ప్రపోజల్ వచ్చింది. దానిదేముంది.. సినిమావాళ్లాకు మామూలే కదా అనుకోవద్దు! ఈ ప్రపోజల్ డిఫరెంట్ గా ఉంది… “మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను.. మీరు నన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉంటారా?” అని మొదలుపెట్టిన ఆ యువకుడు అనంతరం “నేను వర్జిన్.‌. అలాగే వెజిటేరియన్‌‌ కూడా.. లై డిటెక్టర్‌ టెస్టు, నార్కో టెస్టు, వర్జినిటీ టెస్టు, బ్రెయిన్‌ మ్యాపింగ్‌ టెస్టు ఏదైనా సరే చేయించుకోడానికి సిద్ధంగా ఉన్నాను” అంటూ మెసేజ్ చేశాడు.

ఈ మెసేజ్‌ను తన ఇన్‌ స్టాగ్రాం ఖాతాలో షేర్ చేసిన తిలోత్తమ.. “జోక్‌ చేస్తున్నావా బ్రదర్? అవసరం లేదు. బై బై” అంటూ రిప్లై ఇచ్చింది. కాగా… మాన్ ‌సూన్‌ వెడ్డింగ్ ‌తో బాలీవుడ్ ‌‌కు పరిచయమైన తిలోత్తమ.. నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news