కరోనా వ్యాధి ఎక్కువ అయినప్పుడు నుండి దేశంలోని ప్రజలు బయటకు వెళ్లి సరుకులు కొనాలంటే భయమేస్తోంది. చాలావరకు నగరాల్లో ఉండే ప్రజలు బయటకు వెళ్లకుండా ఆన్లైన్ ద్వారా వారికి కావాల్సిన సరుకులను ఇంటికి తప్పించుకుంటున్నారు. ఇకపోతే చాలామంది వారి అవసరాలకు తగ్గట్టు ప్లాస్టిక్ వినియోగం చేస్తూ వస్తున్నారు. ఇలా వాడి పడేసిన ప్లాస్టిక్ భూమి మీద కేవలం పది శాతమే రీసైకిల్ అవుతోంది. మిగతా అంతా భూమిలోనే కూరుకుపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ వాడకం పై ఎన్నిఆంక్షలు తెచ్చిన చివరికి ప్రజలు ప్లాస్టిక్ వాడకుండా ఉండలేకపోతున్నారు.
ఇదే నేపథ్యంలో తాజాగా పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ బాటిల్స్ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అద్భుతాన్ని సృష్టించారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో ఏకంగా చేప బొమ్మలను తయారుచేసి వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో అందరి సృష్టి ఆకట్టుకునేలా పెద్ద పెద్ద చేప బొమ్మలు ఏర్పాటు చేశారు. వాటి పక్కనే పర్యావరణానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని తెలియజేస్తూ బోర్డులు కూడా పెట్టారు.