సిబిల్ స్కోర్ ముఖ్యం కదా..? ఇలా పెంచుకోండి మరి..!

-

సిబిల్ స్కోర్ చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డ్ రుణాలను సకాలంలో చెల్లించడం ఆర్థిక క్రమశిక్షణ ఉండడం వలన మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది. అలానే రుణదాతలు కూడా మీపై విశ్వాసం పొందుతారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది క్రెడిట్ కార్డ్స్ ని వాడుతున్నారు.

షాపింగ్ చెయ్యాలంటే చాలా మంది క్రెడిట్ కార్డ్స్ తో కావలసినవి కొంటున్నారు. మీ బ్యాంకు సేవింగ్స్ ఖాతా లో మంచి బ్యాలెన్స్ ఉంటే క్రెడిట్ కార్డును బ్యాంకులు ఇస్తాయి. తద్వారా మీరు నిత్యావసర వస్తువులను కొనుగోలు చెయ్యచ్చు అలానే లోన్ ని కూడా పొందేందుకు అవుతుంది. ఇక సిబిల్ స్కోర్ బాగుండాలంటే ఏం చెయ్యాలి..? ఎలా సిబిల్ స్కోర్ ని పెంచుకోవాలి అనేది ఇప్పుడే చూద్దాం.

లోన్ తీసుకున్నప్పుడు మీరు మీ EMIలలో ఆలస్యం చెయ్యకూడదు. అలానే డిఫాల్ట్ చేయకూడదు.
ఇలా చేస్తే మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. మీ క్రెడిట్ కార్డ్ EMI మరియు బ్యాలెన్స్‌లను టైం కి చెల్లించాలి. అప్పుడు మీ సిబిల్ స్కోర్ ని పెంచచ్చు.
చాలా మంది ఆఫర్స్ అని ఎక్కువగా కొనేస్తూ వుంటారు. బాధ్యతాయుతంగా ఖర్చు చేయండి. దీపావళి, సంక్రాతి వంటి పండుగ సీజన్లలో ఆఫర్‌లు విడుదల చేయబడతాయి. ఈ సమయంలో మీరు బాధ్యతాయుతంగా ఉండాలి. అవసరం లేని వాటిని కొనద్దు.
క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు చేసే ఏదైనా లోన్ ని ఫుల్ గా పే చెయ్యండి.
క్రెడిట్ కార్డ్ లోన్‌లపై రెగ్యులర్ నెలవారీ EMIలను చెల్లించాలి.
ఒకేసారి ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ని ఉపయోగించద్దు.

Read more RELATED
Recommended to you

Latest news