మనం ఏదైనా ఒక పనిని పర్ఫెక్ట్ గా చేయాలంటే వాటి మీద ధ్యాస పూర్తిగా పెట్టాలి. కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న పనులు వాటిని అడ్డుకుంటూ ఉంటాయి. సమయాన్ని వృధా చేస్తాయి. కలల్ని చేరనివ్వకుండా ఆపుతాయి. కచ్చితంగా మీరు మీ జీవితంలో గెలవాలంటే..?, మీరు అనుకున్నది సాధించాలంటే…? తప్పకుండా వీటిని త్యాగం చేయాలి. వీటిని కనుక అనుసరిస్తే కచ్చితంగా మీరు అనుకున్నది చేయగలరు. కాబట్టి తప్పకుండా వీటి మీద ధ్యాస పెట్టి త్యాగం చేసి అనుకున్నది సాధించండి.
సమయం :
సమయాన్ని సక్రమంగా వినియోగించుకుంటే ఏమైనా చెయ్యచ్చు. ఆగమంటే సమయం ఎవరికోసం ఆగదు. ప్రతి రోజు చాలా ముఖ్యం. మీకు ఉన్న 24 గంటలు మీరు మంచిగా వినియోగించుకోండి. ఏమేం పనులు చేయాలనుకుంటున్నారో వాటిని చేసేయండి. ఎప్పుడు వాయిదా మాత్రం వెయ్యొద్దు.
స్టెబిలిటీ:
నేటి కాలం లో చాలా మందికి స్టెబిలిటీ లేక పోతోంది. ఒకటి అనుకుని వస్తూ ఉంటారు కానీ దారి మారిపోయి.. గమ్యాన్ని మారిపోయి.. సతమతమవుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎంతో స్టేబుల్ గా ఉండాలి. మీరు అనుకున్నది సాధించాలంటే మీకు స్టెబిలిటీ తప్పకుండా ఉండాలి.
పర్సనల్ లైఫ్:
మన పర్సనల్ లైఫ్ కూడా మనం అనుకున్నది సాధించడానికి అవ్వకుండా చేస్తుంది. కాబట్టి వాటిని కూడా మ్యానేజ్ చేసుకుంటూ మీరు మీ గమ్యం పై దృష్టి పెట్టాలి. అలా చేశారంటే మీరు అనుకున్నది సాధించగలరు. అలానే కొన్ని కొన్ని సార్లు నో చెప్పడం నేర్చుకోండి. బలవంతంగా మీరు ఒప్పుకున్నా…చేయడానికి చాలా కష్టం అవుతుందని గుర్తుంచుకోండి.