మూడో విడత ఎన్నికల నామినేషన్ల స్క్రూట్నీ పూర్తి అయింది. మూడో విడత ఎన్నికల్లో 579 సర్పంచులు, 11,732 వార్డులు ఏకగ్రీవాలు అయ్యాయి. మూడో విడతలో మొత్తం 3,221 పంచాయతీలకు గానూ 2,640 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవుల కోసం మొత్తంగా 7,756 మంది అభ్యర్దుల పోటీలో ఉండనున్నారు.
మొత్తం 31, 516 వార్డులకు గానూ 19,607కు ఎన్నికలు జరగనున్నాయి. వార్డు పదవుల కోసం 43,282 మంది అభ్యర్ధుల పోటీకి దిగుతున్నారు. ఈ ఎన్నికలు ఈ నెల 17వ తేదీన జరగనున్నాయి. ఇక ఈరోజు జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీ సత్తా చాటింది. అధిక భాగాల్లో వైసీపీ మద్దతు తెలిపిన అభ్యర్ధులు స్థానాలు గెలుచుకుంటున్నారు. టీడీపీ కూడా చెప్పుకోదగ్గ స్థానాలు సాధిస్తుందని ఆ పార్టీ వారు చెబుతున్నారు.