జపనీయులు చర్మ సౌందర్యానికి అధిక ప్రాధాన్యత నిస్తారు. నార్మల్‌గా స్నానం చేశాం.. చేతులు దులుపుకున్నామని వాళ్లు అనుకోరు. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు.. శరీరం అలసటను దూరం చేసేలా వారు స్నానం చేస్తారు. ఉదయం లేవగానే శుభ్రంగా స్నానం చేసి తమ దైనందిన జీవితాన్ని ప్రారంభిస్తారు. సాధారణంగా కొందరూ రాత్రిళ్లు మాత్రమే స్నానం చేస్తుంటారు. కానీ, జపనీయులు రోజువారీ పనులు పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా స్నానానికి ప్రత్యేకంగా సమయం కేటాయిస్తారు.
స్నానానికి టైం కేటాయించడం ప్రాచీన సంప్రదాయంతోపాటు ఆధునిక జీవనశైలి కూడా ఒక కారణమని చెబుతుంటారు. జపనీయులు చర్మ సౌందర్యానికి.. మొదటగా షవర్ నీళ్లతో శరీరంపై ఉండే దుమ్ముధూళిని కడుకుతారు. బాత్‌టబ్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతకు మించకుండా వేడి నీటిని నింపుతారు. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు కొందరు వనమూలికలను నీళ్లలో కలిపి.. బాత్‌టబ్‌లో స్నానం చేస్తారు. దీంతో శరీరానికి, మెదడుకు విశాంత్రి చేకూరుతుందని జపనీయుల నమ్మకం.
జపనీయులు పని రాక్షసులు. వీరిలో చాలా మందికి రెండేసి ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. మరి కొందరు ఉన్న ఉద్యోగంలోనే అదనపు పనివేళలు చేసేలా చూసుకుంటారు. అయితే ఇన్ టైంకు ఆఫీసుకు చేరుకోవడానికి.. తొందరగా పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ మేరకు శరీరకంగా, మానసికంగా ధృడంగా ఉండేలా చూసుకుంటారు. జపనీయుల సంప్రదాయం ప్రకారం ఉదయం స్నానం చేస్తే ఎక్కువ సమయం పడుతుంది.. అందుకే వాళ్లు సాయంత్రం వేళ స్నానానికి కేటాయిస్తారు. ఉదయం టైం సరిపోదని.. సాయంత్రం అధిక సమయం కేటాయించి స్నానం చేస్తారన్నమాట.
జపనీయుల్లో అత్యధిక మందికి సొంతంగా వాహనాలు ఉన్నాయి. అందుకే ఎక్కువ శాతం వాహనాల్లోనే ప్రయాణిస్తుంటారు. దీంతో ఎల్లప్పుడు ట్రాఫిక్‌లో వెళ్లాల్సి వస్తోంది. ట్రాఫిక్ సమస్య కూడా ఇక్కడ అధికం. రోజంతా ఎండలో ప్రయాణించడం, ఆఫీసులో కష్టపడి పని చేయడం వల్ల.. శరీరం అలసిపోతుంది. చెమట పట్టి.. శరీరం నుంచి దుర్వాసన బయటకు వస్తుంది. పనులన్నీ ముగించుకున్న తర్వాత సాయంత్రం వేళ వెచ్చని నీటితో స్నానం చేస్తుంటారు. ఎండాకాలంలో ఉక్కపోతను తట్టుకోలేక చన్నీటి స్నానం చేస్తుంటారు. అదే చలికాలంలో చల్లదనాన్ని దూరం చేసుకోవడానికి వేడి నీటితో స్నానం చేసేందుకు మొగ్గు చూపుతారు.