స్మార్ట్ ఫోన్ కారణంగా పాడయ్యే చర్మాన్ని బాగు చేసుకునే చిట్కాలు..

-

స్మార్ట్ ఫోన్ వాడకం
స్మార్ట్ ఫోన్ వాడకం

కరోనా కారణంగా అందరూ ఫోన్లకే అతుక్కుపోయారు. పూర్తిగా ఇంట్లోనే గడుపుతున్నారు కాబట్టి స్మార్ట్ ఫోన్ సాయంతో సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. కానీ మీకీ విషయం తెలుసా? స్మార్ట్ ఫోన్ కారణంగా మీ చర్మం పాడవుతుంది. మొటిమలు, నల్లమచ్చలు, ముడుతలు, వృద్ధాప్య ఛాయలు రావడానికి ఇది కారణంగా నిలుస్తుంది. అందుకే స్మార్ట్ ఫోన్ కి దూరంగా ఉండడం చాలా మంచిది.

ఐతే స్మార్ట్ ఫోన్ వాడకం ద్వారా వచ్చే చర్మ సమస్యలను పోగొట్టుకోవడానికి కావాల్సిన చిట్కాలేంటో ఇక్కడ చూద్దాం.

మొటిమలు

మీ మొబైల్ ఫోన్ పూర్తిగా సూక్ష్మక్రిములతో నిండి ఉంటుంది. దాంతో కాల్ మాట్లాడినపుడు అవి మీ ముఖాన్ని చేరతాయి. దానివల్ల చర్మ సమస్యలు వస్తాయి.

పరిష్కారం : ఈ ఇబ్బందిని దూరం చేసుకోవాలంటే ప్లాస్టిక్ కవర్ తో ఫోన్ ని కప్పేయాలి. లేదా ఇంకేదైనా గార్డుతో రక్షించాలి.

ముడతలు

తరచుగా స్మార్ట్ ఫోన్ వైపు చూస్తుండడం వల కళ్ళ చుట్టూ ముడతలు వస్తుంటాయి. మెడ కొద్దిగా వంగుతుంది.

పరిష్కారం : నిపుణులు చెబుతున్న ప్రకారం మొబైల్ ని కంటి లెవెల్ కి తగినట్లుగా పట్టుకోవాలి. ఐ క్రీమ్స్ వాడుతూ ఉంటే ముడతలని పోగొట్టుకోవచ్చు.

ఫోన్ లైట్

ఫోన్ నుండి వెలువడే నీలికాంతి చర్మానికి హాని కలగజేస్తుంది. గంటసేపు ఎండలో నిల్చోవడం, మూడు గంటలు ఫోన్ వాడడం రెండూ ఒకటే. అందుకే ఎక్కువ సేపు ఫోన్ చూస్తూ ఉండకపోవడమే మంచిది.

పరిష్కారం : బ్రైట్ నెస్ తక్కువగా ఉంచుతూ డార్క్ మోడ్ లో ఉండేలా చూసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news