తెలంగాణ ప్రజలకు ఊరట.. తగ్గిన కరోనా కేసులు

-

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో మొన్నటి వరకు భారీగా పెరిగిన కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.   తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 1813  కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 5,96,813 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 17 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు 3426 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 24,301 గా ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 5,69,086 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు.  గత 24 గంటల్లో 1,801 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 95.35 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 94.50 శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.57% గా ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 129896 పరీక్షలు చేశారు. దీంతో  తెలంగాణ వ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య  1,62,57, 268 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news