ఉప్పు ఎక్కువగా తింటున్నారా? ఇక మీ పని అయినట్టే!

-

మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పు ఉందా అంటూ వచ్చే యాడ్స్ చూసి ఇన్‌స్పైర్ అయ్యేవారు కొందరైతే.. ఉప్పుకారం తగ్గిస్తే రోషం ఉండదని మరికొందరు. కారణం ఏదైనా మోతాదుకు మించి తీసుకుంటే ఆనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల కలిగే సమస్యలేంటో తెలుసుకోండి.

ఉప్పు తక్కువ తీసుకుంటే లోబీపీ వస్తుందేమో అని కొందరు అయితే.. వంట రుచికరంగా ఉండడానికి మాత్రమే ఉప్పుని వాడేవారు మరికొందరు. ఇలా రకరకాల కారణాలతో ఉప్పును అధికంగా శరీరంలోకి పంపిస్తుంటారు. దీంతో తెలియకుండానే ఆనారోగ్యానికి గురవుతున్నారు.

1. ఉప్పు ఎక్కువగా తీసుకునేవారు మూత్రవిసర్జన కూడా ఎక్కువగా చేస్తుంటారు. వీరికి దాహం కూడా ఎక్కువగా ఉంటుంది. దాహం వేసినప్పుడు నీరు బాగా తీసుకోవాలి. లేదంటే శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తుంటే ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నారని నిర్థారించుకోండి. అప్పటి నుంచి అయినా ఉప్పును తక్కువ మోతాదులో తీసుకోవడం ప్రారంభించండి.

2. చాలామంది వట్టి ఉప్పును నాలుకపై వేసుకొని చప్పరిస్తుంటారు. అలాంటివారికి ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు తినాలనిపిస్తూ ఉంటుంది. ఇది కొంతమేరకు మాత్రమే బాగుంటుంది. అంతకు మించితే నాలుకపై ఉండే రుచికళికలు ఇతర రుచులను గుర్తించలేవు. దీనివల్ల ఏం తిన్నా సహించదు. ఎలాంటి రుచిని ఎంజాయ్ చేయలేరు.

3. బీపీ సమస్య ఉన్నవారికి కాళ్లు ఎక్కువగా వాపు వస్తుంటాయి. దీనికి కారణం వారి శరీరంలో ఉప్పుశాతం ఎక్కువగా ఉండడమే. ఉప్పు అధిక మోతాదులో తీసుకునే వారి శరీరంలో కూడా వాపులు వస్తుంటాయి. ముఖ్యంగా కాలి మడమ భాగంలో ఉబ్బుతుంది. ఆ ప్రదేశంలో వేలితో నొక్కితే చర్మం లోపలికి పోతుంది. అందుకు కారణం ఆ భాగంలో నీరు అధికంగా చేరడమే. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుందని గుర్తించండి.

4. ఉప్పు ఎక్కువగా తీసుకునే వారిలో నీటిశాతం తక్కువగా ఉంటుంది. ఫలితంగా డీహైడ్రేషన్ బారిన పడి తలనొప్పికి గురవుతుంటారు. కనుక ఆహారంలో ఉప్పు తగ్గించాలి. ముఖ్యంగా ఈ సమస్య వేసవికాలంలోనే వస్తుంది. కనుక ఉప్పు తగ్గిస్తే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news