మెగాస్టార్ మెగా మూవీ సైరా. 2019లో తెలుగు సినిమా పరిశ్రమలో సాహో తర్వాత వస్తోన్న భారీ బడ్జెట్ సినిమా సైరా. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా అక్టోబర్ 2న భారీ ఎత్తున విడుదల అవుతోంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం మెగాస్టార్ అభిమానులే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. సైరాలో ఉన్న హైలెట్స్ గురించి అప్పుడే ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి. చర్చల్లో ఉన్న హైలెట్స్ ఇలా ఉన్నాయి.
ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయి పాత్రలో అనుష్క కనిపిస్తుంది. ఆమె వాయిస్ ఓవర్‌తోనే సైరా కథ స్టార్ట్ అవుతుందట. సిరివెన్నెల రాసిన సైరా నరసింహారెడ్డి పాట ఐదు నిమిషాలకు పైగా ఉంటుంది. ఇక సినిమాలో కీలకమైన వాటర్ ఫైట్ కోసమే కోట్లాది రూపాయలు ఖర్చు చేశారట. తమన్నా – చిరంజీవి విదేశీ ఫైటర్ల మధ్య ఉన్న ఈ ఫైట్ సినిమా మేజర్ హైలెట్స్‌లో ఒకటిగా నిలిచింది.
సైరా సినిమా క్లయిమాక్స్ అన్నది ఎమోషనల్‌గా, డైలాగ్ బేస్ట్‌డా ఉంటుందట…ఈ నేపథ్యంలోనే ప్రీ క్లయిమాక్స్ ఫుల్ యాక్షన్ తో వుంటుంది. ఈ సీన్ల కోసం కోట్లాది రూపాయలు మంచినీళ్లలా ఖర్చయినట్టు చెపుతున్నారు. సైరా ఫస్టాఫ్లో నరసింహారెడ్డి జమీందారీ జీవితం, ఆ విలాసాలతో కూడిన సీన్లు ఉండి… సెకండాఫ్‌లో అసలు పోరాట గాధ ప్రారంభమవుతుంది. సైరాలో జాతర పాట మెగా మాస్ అభిమానులను ఈలలు వేయిస్తుందట. సినిమాలో ప్రతి సీన్‌లోనూ వందలాది మంది నటులతో చాలా భారీగా ఉంటుందని కూడా తెలుస్తోంది.