బాధను పంచే బంధం అవసరమా బాసూ..?

-

ఏ బంధం అయినా మనకు ఆనందాన్ని కలిగించాలి కానీ బాధ కాదు. బాధను పంచుకునేలా ఉండాలి కానీ మనకు భారం కాకూడదు. అలా అనిపించింది అంటే ఆ బంధానికి గుడ్ బై చెప్పై సమయం ఆసన్నమైందని అర్థం. మనల్ని బాధపెట్టే బంధాల వెంట ఆయాసపడుతూ పరుగుపెట్టడం కంటే ఆ బంధాన్ని కోల్పోయామని కొద్దిరోజులు బాధపడి తర్వాత జీవితాన్ని ఆస్వాదించడం బెటర్ అని మానసిక నిపుణులు చెబుతున్నారు. మనసుకు ఆవేదన కలిగించే ఏ రిలేషన్ కూడా ఎక్కువ కాలం నిలవదని అంటున్నారు.

relationship partners

 

ఇద్దరి మధ్య బంధం అనేది ఒకరికొకరు తోడు ఉండేలా.. ఇద్దరూ కలిసి ఎదిగేలా ఉండాలి కానీ ఒకరని మరొకరి కంట్రోల్ చేసేలా ఉండకూడదు. ఇద్దరు కలిసి రిలేషన్​షిప్​లో ఉన్నా ఎవరి ప్రైవసీ, ఎవరి స్పేస్ వాళ్లకు ఉండాలి. వ్యక్తిగత నిర్ణయాలు ఎవరివి వారే తీసుకోవాలి. ఇద్దరికి సంబంధించిన విషయాలు మాత్రం కలిసి నిర్ణయం తీసుకోవాలి. కొత్తగా రిలేషన్​షిప్ స్టార్ట్ చేసేవాళ్లు ముందుగా ఈ విషయాలు చూసుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

కొందరు తమ రిలేషన్​షిప్​లో అవతలి వ్యక్తి తమతో మాత్రమే క్లోజ్​గా ఉండాలని భావిస్తుంటారు. ఇతరులతో కాస్త మాట్లాడినా, కొంచెం క్లోజ్​గా సహించలేరు. అనవసరపు అనుమానాలతో అవతలివారిని వేధిస్తూ ఉంటారు. మీరు ఎవరితో మాట్లాడాలి..? ఎవరితో ఉండాలి..? ఎక్కడికి వెళ్లాలనేది కూడా వారే నిర్ణయిస్తుంటారు. ఇలాంటి వాళ్లని దూరం పెట్టమని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి వారు తమ అనుమానాలతో మీ ప్రశాంతతని దూరం చేస్తారని చెబుతున్నారు. బంధాలకు విలువిచ్చేవారికి, మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారికి మీపై నమ్మకం ఉంటుందని అంటున్నారు.

మీ భాగస్వామి ప్ర‌వ‌ర్త‌న మిమ్మల్ని బాధ పెడితే వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించండి. అయితే మీరు వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో వాళ్లని ఒత్తిడి చేయొద్దు. పెట్టే విధంగా ఉంటే, వారిని మార్చేందుకు ప్ర‌య‌త్నించండి. వారు మారితే మంచిదే. అలాగని మీరు వారి పై ఎక్కువ ఒత్తిడి తీసుకురావద్దు. వారు చేసే పనుల వల్ల, వారి ప్రవర్తన వల్ల మీరెంత బాధ పడుతున్నారో వారికి వివరించండి. అయినా కూడా వారు మారకపోతే వారికి దూరంగా ఉండటమే మంచిది.

మీరు చెప్పేది ప్రతీది వింటూ అతివినయంగా ఉండే వాళ్లను అస్సలు నమ్మొద్దంటున్నారు మానసిక నిపుణులు. వినయంగా ఉండేవాళ్లు కావాలనే అలా నటిస్తారని.. అలాంటి వాళ్లని నమ్మితే మొదటి మోసం వస్తుందని చెబుతున్నారు. ఇలాంటి వాళ్లే సడెన్​గా ఒకరోజు బెదిరింపులు, బ్లాక్​మెయిళ్లకి దిగుతారని హెచ్చరించారు. అందుకే ఇలాంటి వాళ్లకి దూరంగా ఉండమని సూచించారు.

ఏ రిలేషన్​లో కోపతాపాలు, అలకలు, మనస్పర్థలు సహజమే. అయితే అవి పరిధులు దాటితే మాత్రం చాలా కష్టం. కోపమైతే కాసేపటికి తగ్గుతుంది. కానీ బాధ అలా కాదు. అందుకే మీ భాగస్వాములను కోప్పడితే కొంచెం రిస్కే.. కానీ బాధ పెడితే మాత్రం మీరు వాళ్లను దూరం చేసుకుంటున్నట్లే. ఎందుకంటే బాధను తట్టుకునే శక్తి అందరికి ఉండదు. అందుకే రిలేషన్​షిప్​లో ఉన్నవారు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి.

Read more RELATED
Recommended to you

Latest news