44 వేల టీచర్ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదు : ఎంపీ ఆర్‌.కృష్ణయ్య

-

తెలంగాణ ప్రభుత్వం ఎంపీ ఆర్‌ కృష్ణయ్య నిప్పులు చెరిగారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన నిరుద్యోగ గర్జన లో ఆర్‌ కృష్ణయ్య ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదని ఆర్‌ కృష్ణయ్య ప్రశ్నించారు. విద్యకు పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదని ఆరోపించారు ఆర్‌ కృష్ణయ్య.

Rebels attack TDP candidate Krishnaiah - The Hindu

రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే సిటు ఖాళీ ఏర్పడితే ఆరు నెలల్లో భర్తీ చేస్తున్నారని… కానీ పదేండ్లుగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు ఆర్‌ కృష్ణయ్య. టీచర్ల కొరత వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థ కుంటుపడిందన్నారు ఆర్‌ కృష్ణయ్య. పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి ఆయా స్థలాలను అమ్ముకొనేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతుందని ఆరోపించారు ఆర్‌ కృష్ణయ్య. వెంటనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని… లేనిపక్షంలో పాఠశాల డైరెక్టర్ కార్యాలయాన్ని దిగ్భందిస్తామని హెచ్చరించారు ఆర్‌ కృష్ణయ్య.

 

 

Read more RELATED
Recommended to you

Latest news