సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా..? అయితే ఇలా చెయ్యండి..!

-

సిబిల్ స్కోర్ ఎంత ముఖ్యమనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సిబిల్ స్కోర్ ని బట్టి లోన్స్ అనేవి ఇస్తారు. ఈరోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డు లను ఉపయోగిస్తున్నారు. బ్యాంకులో లోన్ ని పొందాలంటే క్రెడిట్ కార్డు ని తప్పకుండా మనం పొదుపుగా వాడుకోవాలి. సివిల్ స్కోర్ బాగుంటేనే లోన్ వస్తుంది లేకపోతే లోన్ రాదు. సిబిల్ స్కోర్ తగ్గడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. క్రెడిట్ కార్డులు వాడకంలో చిన్న పొరపాటు చేసినా అది క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది. లోన్ కోసం ప్రయత్నాలు చేసినప్పుడు ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి.

మీరు లోన్ ని తీసుకోవాలనుకుంటున్నారా.. మీకు క్రెడిట్ స్కోర్ తక్కువ ఉండడంతో లోన్ రావడం లేదా అయితే ఈ టిప్స్ ని పాటించి క్రెడిట్ కార్డు లిమిట్ ని పెంచుకోవచ్చు మరి ఇక వాటికోసం తెలుసుకుందాం. మీ బకాయిలను క్రమం తప్పకుండా సరైన టైం కి కట్టేస్తూ ఉంటే క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. బిల్లులు, ఈఎంఐల వంటివి చెల్లించడంలో ఆలస్యం చెయ్యకండి. ఆలస్యం చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. క్రెడిట్ కార్డు బిల్లులను కచ్చితంగా టైమ్‌కు కట్టేయండి.

ఇలా చేస్తే మీ క్రెడిట్ లిమిట్ కూడా పెరుగుతుంది. అలానే మీ క్రెడిట్ రిపోర్ట్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి కూడా. కొన్ని సార్లు క్రెడిట్ రిపోర్టు లో కూడా తప్పులు దొర్లుతుంటాయి. మీ సిబిల్ స్కోర్ కూడా దెబ్బతింటుంది. క్రెడిట్ రిపోర్టులో లోన్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఏమైనా తప్పులు ఉంటే కూడా సరి చెయ్యచ్చు. సిబిల్ స్కోర్‌ను దెబ్బతీసే అంశాల్లో క్రెడిట్ రిక్వెస్ట్‌లు కీలకంగా ఉంటాయి.

ఒకే సారి ఐదు లేదా ఆరు కంపెనీలు, బ్యాంకులకు లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే కనుక అన్నీ మీ క్రెడిట్ రిపోర్టును తనిఖీ చేస్తాయి. అలాంటప్పుడు మీ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఎప్పుడైనా లోన్, క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కేవలం ఒకే బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీ వద్ద మాత్రమే అప్లే చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news