బ్లాక్ స్పాట్స్ ని ఇలా ఎంతో సులువుగా తగ్గించుకోండి…!

-

ఎంతో అందమైన ముఖం పై బ్లాక్ స్పాట్స్ ఏర్పడుతున్నాయా..? అయితే ఈ చిట్కా తప్పక పాటించండి. ముందుగా బాగా పండిన అరటి పండును తీసుకుని గుజ్జుగా చేసుకోవాలి. అరటిపండు గుజ్జు లో ఒక టేబుల్ స్పూన్ తేనె, అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టేబుల్ స్పూన్ పెరుగు, కోడి గుడ్డు లోని తెల్ల సొన, ఒక టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి తీసుకోవాలి. ఈ పదార్థాలు అన్నిటిని మిక్సీ లో వేసి మెత్తని క్రీం లాగ బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు పట్టించాలి. ఎండకు కమిలిన చర్మానికి పట్టించుకోవడం వల్ల బ్లాక్ స్పాట్స్ తొలగిపోతాయి.

పదిహేను నిమిషాల తర్వాత మెల్లగా మర్దన చేసి గోరువెచ్చని నీటితో కడగాలి ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల చర్మం మెరుస్తూ కాంతివంతం గా ఉంటుంది. అంతేకాదు రోజు ఒకే విధమైన నెక్ ఉండే డ్రెస్సులు వేసుకున్న వాళ్లకు అదే ఆకారంలో చర్మం రంగు మారుతుంది . అలాంటి వారికి ఈ మిశ్రమంతో మంచి ఫలితం లభిస్తుంది.

బాగా ఎక్కువగా నల్ల మచ్చలు ఉండి ప్రతిరోజు శ్రద్ధ తీసుకోవాలనుకుంటే, చందనం పొడి మరియు రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకోవాలి ఇలా ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు రాసుకుని పడుకోవాలి, ఉదయాన్నే గోరు వెచ్చని నీటి తో ముఖాన్ని కడుక్కుంటే నల్లని మచ్చలు తగ్గడం తో పాటు చర్మం నునుపు తేలుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news