తుమ్ము వచ్చినట్టే వచ్చి ఆగిపోతోందా..? ఇలా అయితే పక్కా తుమ్ము వస్తుంది..!

-

ఒక్కొక్క సారి తుమ్ములు వచ్చినట్లే వచ్చి ఆగిపోతూ ఉంటాయి. చాలా సార్లు ఇది జరుగుతూ ఉంటుంది. మీకు కూడా ఎప్పుడూ ఇదే జరుగుతూ ఉంటోందా..? తుమ్ము వచ్చినట్టే వచ్చి ఆగిపోతున్నట్లయితే ఇలా ట్రై చేయండి. అప్పుడు కచ్చితంగా తుమ్ములు వచ్చేస్తాయి. ఒక్కొక్క సారి తుమ్ములు వచ్చినట్లే వచ్చి ఆగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది కానీ ఈ విధంగా మీరు చేస్తే ఖచ్చితంగా తుమ్ములు వస్తాయి.

టీజర్స్ పద్ధతి:

ఈ పద్ధతి ద్వారా మీరు ఈజీగా తుమ్ములను తెచ్చుకోవచ్చు. మీరు నెమ్మదిగా మీ ముక్కులోని వెంట్రుకలని లాగితే తుమ్ములు ఈజీగా వస్తాయి. ఇది కాస్త ఇబ్బందిగా ఉంటుంది కానీ ఖచ్చితంగా తుమ్ములు వస్తాయి.

క్లాత్ లేదా కాటన్ శ్వాబ్ తో ఇలా చేయండి:

తుమ్ములు రావాలంటే ఒక కర్చీఫ్ కొసని కానీ టిష్యుని కానీ లేకపోతే కాటన్ శ్వాబ్ ని కానీ ఉపయోగించి నమ్మదిగా ముక్కు రంధ్రాల్లో పెట్టి తిప్పండి. ఇలా చేస్తే వెంటనే తుమ్ములు వచ్చేస్తాయి.

వెల్తురు లోకి వెళ్ళండి:

బ్రైట్ గా ఉండే లైట్ దగ్గరికి వెళితే కూడా తుమ్ములు వస్తాయి దీనిని ఫాటిక్ స్నిజ్ రిఫ్లెక్స్ అంటారు సూర్యకిరణాలు డైరెక్ట్ గా పడేలా కానీ బల్బు దగ్గరికి కానీ వెళితే వెంటనే తుమ్ములు వస్తాయి.

ఘాటైన వాసనల్ని చూడండి:

పెప్పెర్మింట్ ఆయిల్ యూక్లిప్టస్ లేదంటే మిరియాల వాసనను చూస్తే కూడా తుమ్ములు వస్తాయి. తుమ్ములు ఆగిపోతున్నట్లయితే ఇలా ట్రై చేయొచ్చు.

నాజల్ స్ప్రే:

నాజాల్ స్ప్రే ని కూడా మీరు ఉపయోగించవచ్చు ఇది కూడా తుమ్మలని తీసుకువస్తుంది లేదంటే మీరు కావాలంటే ఇంట్లోనే కొంచెం ఉప్పు గోరువెచ్చని నీళ్లు వేసి దానిని ముక్కు రంధ్రాల్లో స్ప్రే చేసుకోవచ్చు ఇలా వెంటనే తుమ్మలను తెచ్చుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news