’ మా‘ ఎన్నికలపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు… విష్ణు గెలుపుకు తొందరెందుకు

-

మూవీ ఆర్టిస్ అసోసియేషన్ ’మా‘ ఎన్నికలు రాజకీయాలను తలపిస్తున్నాయి. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెళ్ల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఇరు ప్యానెళ్లకు మద్దతుగా పలువురు నటులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య నిన్న విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి. తాజాగా నాగబాబు మా ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాకు కోటి రూపాయలు తీసుకోనే దమ్మున్న నటుడు ప్రకాష్ రాజ్ అని నాగబాబు అన్నారు. ప్రకాష్ రాజ్ కోటి వదులుకుని ’మా‘ ఎన్నికల కోసం వచ్చారని నాగబాబు అన్నారు. చిన్న పెద్ద సినిమాాలకు ప్రకాష్ రాజ్ కావాలని అన్నారు. మంచు విష్ణును గెలిపించాలనే కంగారు ఎందుకని ప్రశ్నించారు. ఉత్తమ నటుడిగా ప్రకాష్ రాజ్ ను అందరూ ఒప్పుకోవాల్సిందే అని అన్నారు. ఓటుకు రూ. 15 వేలు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ ను గెలిపించుకుంటామని నాగబాబు అన్నారు. వందశాతం ప్రకాష్ రాజుకు మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news