తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం ఇప్పుడు అందరికీ దక్కుతోంది. కరోనా నేపథ్యంలో సర్వ దర్శనం టికెట్లపై నిబంధనలు విధించిన టీటీడీ అధికారులు, ప్రస్తుతం ఆ నిబంధనలను సడలిస్తున్నారు. తాజాగా సర్వ దర్శనం టికెట్ల టోకెన్ల సంఖ్యను పెంచారు. దాదాపు కొన్ని నెలలుగా సర్వ దర్శనం టికెట్లను మూసివేసిన టీటీడీ, కొద్ది రోజుల క్రితమే వాటిని భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. ఐతే కేవలం చిత్తూరు జిల్లా వాస్తవ్యులకు మాత్రమే సర్వ దర్శనం టోకెన్లను ఇచ్చారు.
అది కూడా రోజుకి రెండు వేల మందికి మాత్రమే. ప్రస్తుతం ఈ నిబంధనను సడలించారు. చిత్తూరు జిల్లా వాస్తవ్యులకే కాకుండా అందరు భక్తులకు సర్వ దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. టోకెన్ల సంఖ్యను రెండు వేల నుండి ఎనిమిది వేలకు పెంచుతున్నారు. ఈ మేరకు ఈరోజు నుండి అన్ని ప్రాంతాల భక్తులకు సర్వ దర్శనం టికెట్లు లభించనున్నాయి.