పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలోని శ్రీవారి ఆలయం మరోసారి మూతపడబోతోంది. తిరుపతిలోని అనుబంధ ఆలయాలను కూడా మూసివేయబోతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. దీనికి ప్రధాన కారణం సూర్యగ్రహణం. సూర్యగ్రహణం కారణంగా ఈనెల 21న తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్టు అధికారులు తెలిపారు. రేపు ఉదయం 10.18 నుంచి మధ్యాహ్నం 1.38 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. దీంతో ఇవాళ రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ అనంతరం మూసే శ్రీవారి ఆలయ తలుపులు రేపు మధ్యాహ్నం గ్రహణం వీడిన తర్వాత 2.30 గంటలకు తెరుస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం నుంచి సుప్రభాతం, శుద్ధి, తోమాల సేవ, కొలువు, ఏకాంతసేవ నిర్వహిస్తామన్నారు.