తిరుమల భక్తులకు అలర్ఠ్.. తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో తిరుమల శ్రీవారి సన్నిధిలోని వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు. ఈ తరుణంలోనే… టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇక 52, 643 మంది భక్తులు..నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 24527 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం 3.73 కోట్లుగా నమోదు అయింది.
కాగా.. ఇవాళ ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి. తిరుమలలో ఇవాళ శ్రీవారి పుష్పయాగానికి అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది. రేపు మలయప్పస్వామికి పుష్పార్చన ఉంటుంది.. ఈ సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ. ఇవాళ, రేపు కూడా ఆర్జిత సేవలు రద్దు కానున్నట్లు సమాచారం.
- తిరుమల..వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 20 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 52643 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 24527 మంది భక్తులు
- హుండి ఆదాయం 3.73 కోట్లు