తిరుపతిలో లేడీ దొంగలు.. క్షణాల్లో లక్షలు మాయం !

తిరుపతిలో లేడి దొంగలముఠాలు రెచ్చి పోతున్నాయి. బీహార్, రాజస్థాన్ కి చెందిన ఈ ముఠా వరుస చోరీలతో తిరుపతి పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మొన్న అడుక్కుంటూ ఒక స్టీల్ షాప్ లోపలికి వెళ్ళి పోయిన ఈ ముఠా సభ్యులు ఏకంగా లక్షన్నర రూపాయలు చోరీ చేశారు. నిన్న కూడా ఇలానే మరో షాపులో కూడా కొంత నగదు దొంగల ముఠా చోరీ చేసిందని సమాచారం. చిన్న చిన్న పిల్లలతో కలిసి షాప్ లోకి చొరబడి ఈ ముఠా దానం చేయాలని వేడుకుంటున్నట్టు నటిస్తూ యజమానిని ఏమార్చి వారి దృష్టి మరల్చి చిన్న పిల్లల చేత డబ్బులు దొంగతనం చేస్తున్నారు.

రెండు రోజుల్లో వరుసగా రెండు చోట్ల దొంగతనాలు చేయడంతో తిరుపతి పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ రెండు షాపుల యజమానులు ఫిర్యాదుతో పోలీసులు దొంగల వేట మొదలు పెట్టారు. అలానే తిరుపతి లో ఉన్న అన్ని షాపులు యజమానులను అప్రమత్తం చేశారు. ఒంటి నిండా ముసుగు కప్పుకున్న మహిళలు చిన్న చిన్న పిల్లలతో వచ్చి ఈ చోరీలకు పాల్పడినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఒకవేళ అలాంటి వాళ్ళు షాప్ లోకి వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు కోరుతున్నారు