భారీగా పెరిగిన పసిడి ధరలు…

-

కరోనా లాక్ డౌన్ లో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి… మళ్ళీ ఇప్పుడు పెరగడం మొదలుపెట్టాయి. గత నాలుగు రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర 2 వేలకు పైగా పెరిగింది. 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 2120 రూపాయల భారీ పెరుగుదల నమోదు చేసింది. దీనితో 44,740 రూపాయలుగా ఉంది.

24 క్యారెట్ల బంగారం ధర ఆ స్థాయిలో పెరగలేదు. 970 రూపాయల పెరగడంతో 46,900 రూపాయలుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలలో బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర… 2120 రూపాయల వరకు పెరిగింది. దీనితో 44,740 రూపాయలుగా ఉంది బంగారం. 24 క్యారెట్ల బంగారం ధర 970 రూపాయల పెరుగడంతో 46,900 రూపాయలుగా ఉంది.

దేశరాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1620 రూపాయల వరకు పెరిగింది. 47,650 రూపాయలు గా ఉంది బంగారం. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 2030 రూపాయల పెరుగడం తో 45,150 రూపాయలగా ఉంది. కేజీ వెండి ధర 42 వేల మార్కు దాటింది. కేజీ వెండి ధర 42,200 రూపాయలు గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news