నేడు టీఆర్ఎస్ కీల‌క స‌మావేశం.. కేంద్రంపై ఇక యుద్ధ‌మై

-

ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ అధ్యక్ష‌తన కీలక స‌మావేశం నిర్వ‌హించ‌నుంది. తెలంగాణ భ‌వ‌న్ లో జ‌రిగే ఈ స‌మావేశానికి టీఆర్ఎస్ పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధులు తో పాటు కీల‌క నేత‌లు హాజ‌రు కానున్నారు. ఈ స‌మావేశంలో ప్ర‌ధానం గా కేంద్ర ప్ర‌భుత్వం పై పోరాటం ఉదృతం చేయ‌డానికి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. ధాన్యం కొనుగోల్ల నుంచి బొగ్గు గ‌నులు ప్రయివేటీక‌ర‌ణ వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల పై టీఆర్ఎస్ పార్టీ ఎలా అనుస‌రించాల్సిన తీరుపై టీఆర్ఎస్ ప్ర‌జా ప్ర‌తినిధులకు నేత‌ల‌కు సీఎం కేసీఆర్ దిశా నిర్ధేషం చేయ‌నున్నారు.

అలాగే కేంద్రం పై పోరు కు సంబంధించిన భ‌విష్య‌త్తు కార్య‌చ‌ర‌ణ ను కూడా సీఎం కేసీఆర్ వివ‌రించ‌నున్నాడు. అలాగే కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని జ‌నాల్లోకి తీసుకెళ్లేలా వ్యూహాల‌ను ర‌చించనున్నాడు. అలాగే సీఎం కేసీఆర్ ఇటీవ‌ల జిల్లాల ప‌ర్య‌ట‌న చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. దీని పై కూడా చ‌ర్చించే అవ‌కాశం ఉంది. అయితే ఈ స‌మావేశం తెలంగాణ భ‌వ‌న్ లో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌తన ఈ రోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news