విరాట్ కోహ్లీలాగే నాకూ అన్యాయం జరగిందంటున్న మరో క్రికెటర్…

బీసీసీఐ, విరాట్ కోహ్లీల మధ్య విభేదాలు వచ్చాయా అంటే.. జౌననే సమాధానం వస్తుంది. తాజాగా జరుగుతున్న పరిణామలను చూస్తే సగటు క్రికెట్ అభిమానికి ఇదే అనుమానం కలుగుతుంది. కొహ్లీకి ఇష్టం లేకున్నా కావాలనే కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఓ వీడియోను రిలీజ్ చేసిన విరాట్ కోహ్లీ దాంట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. కెప్టెన్సీ నుంచి తొలగింపు తనకు గంట ముందే చెప్పారని అన్నారు. దీనికి విరుద్ధంగా బీసీసీఐ మాత్రం తాము విరాట్ కోహ్లీకి ముందే చెప్పామని అంటోంది. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీకి మధ్య గ్యాప్ ఏర్పడిందనే రూమర్స్ కూడా వస్తున్నాయి.

ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీలాగే తనకు అన్యాయం జరిగిందంటున్నారు మరో క్రికెటర్. వన్డే క్రికెట్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీని తొలగించడంపై ఆయన స్పందించారు వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా. ఆయన ఈ వివాదంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. విరాట్ లాగే తనకు గతంలో అన్యాయం జరిగిందని అంటున్నాడు. టీమిండియాలో కొందరు ఆటగాళ్లు అద్భుతంగా రాణించినా.. బీసీసీఐ అకారణంగా వారిపై వేటు వేసిందని పరోక్షంగా తన గురించి మాట్లాడుతూ… బీసీసీఐ పై మండిపడ్డారు. బోర్డుకు వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం కొత్తేమి కాదని వ్యాఖ్యనించాడు అమిత్ మిశ్రా.