జీవో నెంబర్ 1 పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు పాల్గొన్న కందుకూరు..గుంటూరు సభల్లో 8 మంది మరణించారు. దీంతో.. బహిరంగ సభలు.. రోడ్ షోల నిర్వహణ పైన ఆంక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ప్రత్యేక పరిస్థితుల్లో మినహా రోడ్ల పైన వీటి నిర్వహణకు అనుమతి నిరాకరించింది. ఈ జీవో పైన రాష్ట్రంలో రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది.ఈ జీవో జారీ పైన హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిని విచారించిన న్యాయస్థానం తొలుత ఈ రోజు వరకు జీవో అమలు పైన సస్పెన్షన్ విధించింది. దీనిని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో అప్పీల్ చేసింది. కాగా, సుప్రీం సూచనల మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కేసును విచారించారు. జీవో పైన విచారణ నేటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో నేడు జీవో నెంబర్ 1పై కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది.
చంద్రబాబు సభల్లో తొక్కిసలాట తరువాత తీసుకొచ్చిన ఈ జీవో ప్రతిపక్షాలను ఉద్దేశించి తీసుకొచ్చారంటూ టీడీపీ – జనసేన వామపక్షాలు ఆరోపించాయి. కుప్పంలో చంద్రబాబు రోడ్ షో కు ఈ జీవో చూపించి పోలీసులు అడ్డుకున్నారు. దీని పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబును కుప్పంలో అడ్డుకోవటం పైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంఘీభావం ప్రకటించారు.