ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతన్న టెస్టు సిరీస్ లో భాగం గా నేటి నుంచి చివరి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. కాగ మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రా గా ముగియడం తో.. ఈ మ్యాచ్ గెలిచిన వారికే సిరీస్ దక్కే అవకాశం ఉంది. కాగ మొదటి టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ అద్భుతం గా ఆడి ఓటమి నుంచి గట్టేక్కింది. అదే ఆత్మ విశ్వసం తో రెండో టెస్టు బరి లో కి దిగుతుంది. కాగ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్ కు అందుబాటు లో ఉంటున్నాడు.
దీంతో టీమిండియా అదనపు బలం గా ఉంటుంది. అయితే కోహ్లి వస్తే తుది జట్టు లో ఎవరు స్టానం కోల్పోతారో అనే ఉత్కంఠ మాత్రం తగ్గలేదు. అయితే ఈ టెస్టు మ్యాచ్ కు పుజారా లేదా రహనే లో ఒకరు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే చివరి టెస్ట్ ముంబై లో ని వాంఖండే స్టేడియం లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పిచ్ ను సిద్ధం చేశారు. అయితే స్పిన్నర్లు కు అనుకూలించే విధం గా క్యూరేటర్లు ఈ పిచ్ ను సిద్దం చేశారని తెలుస్తుంది.