బరువు తగ్గాలంటే ఉదయాన్నే ఇలా చేసుకుని తాగండి..!

-

చాలా మంది ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉంటారు. అయితే ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉండడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అటువంటి వాళ్ళు వీలైనంతవరకు బరువు తగ్గడం మంచిది.

 

చాలామందికి ఈ విషయం తెలిసి బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలించకపోతే ఈ టిప్స్ ని పాటించండి. వీటిని అనుసరిస్తే తప్పక బరువు తగ్గడానికి అవుతుంది. ఉదయాన్నే లేచిన తర్వాత ఈ టిప్స్ ని తప్పక పాటించండి దీనితో బరువు తగ్గొచ్చు.

గోరువెచ్చని నీళ్లలో తేనె మరియు నిమ్మ:

నిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల త్వరగా కొవ్వు కరుగుతుంది. తేనెని వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. ఖాళీ కడుపున అల్పాహారం తినడానికి 20 నిమిషాల ముందు ఈ మిశ్రమాన్ని తీసుకోండి. రెగ్యులర్ గా ఈ పద్ధతి ఫాలో అయితే బరువు తగ్గడానికి బాగుంటుంది.

జీలకర్ర నీళ్లు:

జీలకర్ర నీళ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. రాత్రి మీరు కొద్దిగా జీలకర్రను ఒక గ్లాసు నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే వేడి వేడిగా తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ చిట్కాను కూడా రోజూ అనుసరించడం మంచిది.

దాల్చిని నీళ్లు:

కొవ్వును కరిగించడానికి దాల్చిని బాగా ఉపయోగపడుతుంది దాని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మెటబాలిజంని ఇది బూస్ట్ చేస్తుంది అలాగే ఇన్సులిన్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. ఒక గ్లాసు నీళ్లని మరిగించి అందులో దాల్చిన వేసి తీసుకుంటే బరువు తగ్గడానికి అవుతుంది.

ఉసిరి:

వేడి నీళ్లలో ఉసిరిరసం వేసుకుని కూడా తీసుకోవచ్చు దీనివల్ల కూడా త్వరగా బరువు తగ్గడానికి అవుతుంది. కాబట్టి ఉదయాన్నే ఈ విధంగా అనుసరించి బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండండి. లేదంటే లేనిపోని సమస్యలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news