కాలికి మెట్టెలు పెట్టుకోవడం వల్ల కలిగే మేలు..!

-

భారతదేశంలో పెళ్ళైన స్త్రీలు కాలికి మెట్టెలు పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం భారతీయ సాంప్రదాయం. ఇది కేవలం సాంప్రదాయం కొరకు మాత్రమే ఏర్పరచబడినది కాదు. దీని వెనుక ఉన్న ఆడవాళ్ళకు సంబంధించిన ఆరోగ్య రహస్యం దాగివుంది. దీని గురించి పతంజలి మహర్షి పాదమర్దనం అనే యోగ ప్రక్రియలో సవివరంగా తెలియచేశారు. ఇంతకు ముందు రోజుల్లో భారతదేశంలో స్త్రీలు ఎక్కువగా నీటిలోనే పని చేయవలసి వచ్చేది.

గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, ఇలా పలు రకాల రోజువారీ పనులు చేసుకోడానికి ఎక్కువగా వారు కాళ్ళు నీళ్లలో నానుతునే ఉండేవి. అందువల్ల ఎక్కువగా జలుబు, కాలి వ్రేళ్ళు వాయటం, ఇన్ఫెక్షన్లు వంటి వాటికి గురయ్యేవారు. మెట్టెలు ధరించినప్పుడు వేళ్ళకు నడిచే సమయంలో ఒత్తిడి కలిగించడం ద్వారాఅరికాళ్ళలో ఒత్తిడి కలిగించడం ద్వారా మిగతా శరీర భాగాలకు చేతన కలిగి ఆయ భాగాలలో ఉండే సమస్యలు నివారింవచ్చును.

కాలి బొటన వేలు తల భాగాన్ని, మిగిలిన వేళ్ళు కళ్ళు, ముక్కు , గొంతును సూచిస్తాయి. కాలివ్రేళ్ళ క్రింది భాగం అంటే పాదాలకు వ్రేళ్ళకు మధ్య కలిసి ఉండే భాగం గొంతు భాగాన్ని సూచిస్తుంది. అరికాలి పైన ఉండే ఉబ్బెత్తు భాగం చాతీని సూచిస్తే, అరికాలి లోని గుంట భాగం నడుమును, కాలి మడమ భాగం కాళ్ళను కాలి చివరి భాగం అరికాళ్ళను/మడమలు/పాదాలను సూచిస్తాయి. బొటన వేలిని ఉబ్బెత్తు భాగాలను మర్దించటం ద్వారా తలకు సంబందించిన సమస్యలు నెమ్మదిస్తాయి. మిగిలిన వేళ్ళ ఉబ్బెత్తు భాగాలు మసాజ్ చేయడం ద్వారా కళ్ళు, ముక్కు, గొంతుకు సంబంధించిన అవయవాలకు ప్రేరణ కలిగి భాగాల సమస్యలను నివారించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news