బెల్లం ఉంటే చాలు ఈగలు వెంటనే వస్తాయి అనేది జగమెరిగిన సత్యం. కానీ కొన్ని పవిత్ర ప్రదేశాలలో బెల్లం ఉన్నా ఈగలు అక్కడకు రావు. అలాంటి అద్భుత ఘట్టం మన ప్రాంతంలో ఎక్కడో తెలుసుకుందామా ? ఆ విశేషాలు…
మేడారం జాతర.. లక్షలాదిమంది భక్తులు.. టన్నుల కొద్ది బంగారం అదేనండి బెల్లం అమ్మవార్లకు సమర్పిస్తారు. దాన్ని ప్రసాదంగా తీసుకువడమే కాదు తమ బంధువులకు, మిత్రులకు ఇవ్వడానికి ఇంటికి తీసుకునిపోతారు.
మేడారంలో సమ్మక-సారలమ్మ గద్దెలు జమ్మిచెట్టు కింద ఉంటాయి. ఈ జమ్మి చెట్టుపై పాము కనబడితే వనదేవతల ఆశీర్వాదం తమకు లభించినట్టు భావిస్తారు. అంతేకాదు తమ కోర్కెలు నెరవేరిన భక్తులు మేడారంలో బంగారంగా బెల్లం సమర్పించినా, జాతర నాలుగు రోజులూ ఒక్క ఈగ కూడా కనిపించకపోవడం మరో అద్భుతం. నాలుగు రోజులు వేలాది టన్నులు బెల్లం భక్తులు సమర్పిస్తారు. దేవతలు గద్దెనెక్కి వనప్రవేశం చేసేంత వరకూ ఈగలు ఈ చుట్టుపక్కలు కనిపించవు. అమ్మవార్లు వనప్రవేశం చేసిన తర్వాత మాత్రం ఈగలు పెద్దఎత్తున చుట్టుముడతాయి. ఈ ఘట్టం చూసి అందరూ నేటికి ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. భక్తులు సమ్మక్క సారలమ్మ మహిహగా అభివర్ణిస్తారు.
– కేశవ