రాష్ట్రపతి చేతులమీదుగా పద్మశ్రీ అవార్డుల అందుకున్న నీరజ్ చోప్రా

-

కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే దేశ ప్రథమ పౌరుడు అయిన రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమ జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ చేతుల మీదుగా ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా పద్మ శ్రీ అవార్డు అందుకున్నాడు.

మొన్న జరిగిన ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ తెచ్చినందుకు గాను ఈ అవార్డు ను ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాతో పాటు.. భారత్ బయోటెక్ ఎండి కృష్ణా ఎల్లా, జాయింట్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా, కూడా రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. అటు సింగర్ సులోచన చవాన్, పద్మజా రెడ్డి కూచిపూడి డాన్సర్ రాష్ట్రపతి చేతులమీదుగా పద్మశ్రీ అవార్డుల అందుకున్నారు. అలాగే ఐర్లాండ్‌కు చెందిన ప్రొఫెసర్ రట్జర్ కోర్టెన్‌హోస్ట్‌కు ఐరిష్ పాఠశాలల్లో సంస్కృతాన్ని ప్రాచుర్యం కల్పించడంలో చేసిన కృషికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పద్మశ్రీ అవార్డును ప్రదానం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news