హీరోయిన్లు సినిమాల నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కి వెళ్తే కెరీర్ స్లంపులో పడుతుందనే ఒపీనియన్ ఉండేది. రేంజ్ మారిపోతుందని, మళ్లీ సినిమా అవకాశాలు రావనే భయాలు ఉండేవి. కానీ ఇప్పుడీ ఆలోచనలని మార్చేస్తున్నారు స్టార్ హీరోయిన్లు. సినిమాలు, వెబ్ సీరీస్‌లు రెండిటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటున్నారు.
తెలుగు, తమిళ్ సినిమాలతో ఇంప్రెస్ చేస్తోన్న రాశీఖన్నా ఇప్పుడు ఒక వెబ్‌సీరీస్‌కి సైన్ చేసింది. దర్శకద్వయం రాజ్.డికె డైరెక్షన్‌లో షాహిద్ కపూర్‌తో కలిసి వెబ్ సీరీస్ చెయ్యబోతోంది. షాహిద్ కపూర్‌తో సీరీస్ చేస్తే, నార్త్‌లో ఫేమ్ వస్తుందని, ఈ పాపులారిటీతో బాలీవుడ్‌లో బిజీ కావొచ్చని ఆశపడుతోందట రాశీ ఖన్నా.
కాజల్ అగర్వాల్ రెండు పడవల ప్రయాణం చేస్తోంది . ఒకవైపు సినిమాలు మరోవైపు వెబ్ సీరీసులతో ఫుల్ బిజీగా ఉంది. పెళ్లి తర్వాత యంగ్‌స్టర్స్ నుంచి ఆఫర్స్ తగ్గినా, సీనియర్ల సినిమాలతో బండి లాగిస్తోంది. కమల్ హాసన్‌తో ‘ఇండియన్2’, చిరంజీవితో ‘ఆచార్య’ చేస్తోంది కాజల్. ఈ సినిమాలతోపాటు రెండు వెబ్ సీరీసులకి కూడా సైన్ చేసింది చందమామ. ‘లైవ్ టెలికాస్ట్’ అనే హారర్ సీరీస్‌తో పాటు, ‘క్వాంటికో’ రీమేక్‌కి ఓకే చెప్పిందట కాజల్.
సమంత పెళ్లి తర్వాత కమర్షియల్ సినిమాలు తగ్గించింది. స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌కే సైన్ చేస్తోంది. కానీసినిమాల్లో పెద్దగా ఛాలెంజింగ్ రోల్స్ రాట్లేదు. దీంతో కొత్త కొత్త ప్లాట్‌ఫామ్స్ వెతుక్కుంటోంది సమంత. ఈ ఇదిలోనే వెబ్ సీరీసులు చేస్తోంది. హిందీలో ‘ది ఫ్యామిలీమెన్2’ అనే వెబ్ సీరీస్‌లో విలన్‌గా నటించింది సామ్. తమన్నాకి ఇప్పుడు భారీ సినిమాలు రాట్లేదు. స్టార్ హీరోలు మిల్కీని రిపీట్ చెయ్యట్లేదు. పైగా తమన్న కూడా కొంచెం యూనిక్‌గా ఉండే క్యారెక్టర్స్ చెయ్యాలనుకుంటోంది. ఈ లెక్కలతోనే నితిన్ ‘అంధాదున్’ రీమేక్‌లో నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తోంది. అలాగే ‘ది నవంబర్ స్టోరీస్, లెవంత్ అవర్’ అనే సీరీస్‌లకి ఓకే చెప్పింది తమన్న.