ప్రియాంక హత్య ఘటనపై.. టాలీవుడ్ ప్రముఖుల రియాక్షన్..

-

హైదరాబాద్ శివారు ప్రాంతంలో ప్రియాంక రెడ్డి అనే ఓ మహిళా వెటర్నరీ డాక్టర్ దారుణమైన రీతిలో హత్యకు గురైంది. శంషాబాద్ లోని తన ఇంటికి వచ్చే సమయంలో కొందరు దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఔటర్‌ రింగ్ రోడ్డుపై కిడ్నాప్‌ చేసి, అత్యాచారం చేసి ఆమెను 28 కి.మీ. దూరానికి డీసీఎంలో తీసుకెళ్లి సజీవ దహనం చేసినట్లు తెలిసింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో నగరం నలుమూలలా జనం ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక రెడ్డి హత్యపై పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు ఘాటుగా స్పందిస్తూ, ప్రియాంక కుటుంబానికి సంతాపం తెలిపారు.

ప్రియాంక హత్య ఘటనపై నటి కీర్తి సురేశ్: “డాక్టర్ ప్రియాంకా రెడ్డిపై అత్యాచారానికి పాల్పడి, సజీవదహనం చేశారన్న వార్త నా హృదయాన్ని కలచివేసింది. రోజురోజుకూ పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి. నిందితులందరికీ కఠిన శిక్ష విధించాల్సిందే. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

సుధీర్ బాబు: ప్రియాంక రెడ్డి హత్య ఘటన గురించి తెలిసి చాలా డిస్టర్బ్ అయ్యానని సుధీర్ బాబు పేర్కొన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన ఆయన.. నా చెల్లెలంతా ఎల్లప్పుడూ పోలీసుల సహకారం తీసుకోవాలని వేడుకొన్నారు.

మెహ్రీన్: ప్రియాంక రెడ్డి అత్యాచారం విష‌యం తెలిసి షాకయ్యా అంటూ మెహ్రీన్ ట్వీట్ చేసింది. ఇది చాలా ఘోరమైన సంఘటన అని, వెంటనే దుండగులను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని పేర్కొంది.

లావణ్య త్రిపాఠి: ప్రియాంక రెడ్డి హత్య ఘటన తనను చాలా డిస్టర్బ్ చేసిందని లావణ్య త్రిపాఠి పేర్కొంది. ప్రియాంక రెడ్డి, ఆమె కుటుంబ సభ్యుల ఆ బాధను ఊహించుకుంటేనే మనసు తరుక్కు పోతోందని, వెంటనే వారికి న్యాయం జరగాలని ట్వీట్ చేసింది.

 

అల్లరి నరేష్: ప్రియాంక రెడ్డి హత్య చాలా ఘోరం, భీకరం, ఈ సంఘటన గురించి తెలిసి చాలా డిస్టర్బ్ అయ్యాను. మన దేశంలో ఆడవాళ్లకు రక్షణ కల్పించినప్పవుడే అసలు ఫ్యూచర్ ఉంటుంది అంటూ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

వరుణ్ సందేశ్: ఇదో భయానక ఘటన. ప్రియాంక రెడ్డి రేప్, సజీవ దహనం గురించి తెలిసి చాలా బాధ పడ్డాను. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులను ఎలా శిక్షించాలో అర్థం కావడంలేదని పేర్కొంటూ.. ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news