2021 Round up: ఈ ఏడాది భారత్ క్రికెట్ జట్టు జయాపజయాలు, చోటు చేసుకున్న మార్పులు…!!

-

2021 పూర్తయిపోయింది. ఇక 2022 వస్తోంది. ఈ సంవత్సరం భారత క్రికెట్ జట్టు కి కాస్త కలిసివచ్చింది కానీ కొన్ని ఓటములు తప్పలేదు. ఐసీసీ టోర్నీలో భారత జట్టు కి కలిసిరాకపోయినా పలు మ్యాచులలో గెలిచింది. ఇదిలా ఉంటే స్వదేశంలో ఇంగ్లాండ్ ని ఓడించి టెస్ట్ సిరీస్ లో 3-1 తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అలానే టీ20 లో 3-2 తేడాతో సిరీస్ గెలిచింది భారత్. వన్డే సిరీస్లో చూసుకున్నట్లయితే 2-1 తేడాతో భారత్ గెలిచింది.

 

virat-kohli
virat-kohli

ఇవన్నీ ఇలా ఉంటే తర్వాత విరాట్ కోహ్లీకి అంతా దురదృష్టమే కలిగింది. ఐపీఎల్ ఫస్టాఫ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరవాలేదనిపించినా రెండవ హాఫ్ లో మాత్రం నిరాశపరచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆఖరికి నాలుగో స్థానం లో నిలిచింది.

ఇదిలా ఉంటే మరి ఎన్నో అంచనాలతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్ కి బయలుదేరిన భారత జట్టు కి నిరాశ కలిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అవి ఆవిరైపోయాయి. ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఇంగ్లాండ్ టూర్ లో 4 టెస్టుల్లో రెండు విజయాలు ఒక పరాజయం అందుకుంది భారత్. టీం లీడ్స్ టెస్టులో 78 పరుగులకే ఆలౌట్ అయ్యింది మాంచెస్టర్ లో జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ అయితే వాయిదా పడిపోయింది. ఇక విరాట్ టి20 కెప్టెన్ కింద తప్పుకున్నట్టు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. 11 టి20 సిరీస్ లో వరుసగా గెలిచిన విరాట్ ఇలా ప్రకటించడం షాక్ కి గురిచేసింది.

ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోయింది. అయితే పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోవడం ఇదే మొదటిసారి. అలాగే తప్పక గెలవాల్సిన న్యూజిలాండ్ చేతిలో కూడా భారత్ ఓడిపోయింది. తర్వాత మూడు మ్యాచ్ లో గెలిచిన సరే ఫలితం లేకపోయింది. ఇక రవిశాస్త్రి పదవీకాలం ముగిసి రాహుల్ ద్రావిడ్ ఆ స్థానం లోకి వచ్చారు. ఆ తరవాత అయన వన్డే కెప్టెన్ కింద రోహిత్ శర్మని నియమించారు.

Read more RELATED
Recommended to you

Latest news