ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ పలు చోట్ల డౌన్ అయింది. అప్పుడప్పుడు ఇలా సైట్లు డౌన్ అవడం మామూలే. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్ చాలా చోట్ల పనిచేయడం లేదు. దీంతో ఇన్‌స్టాగ్రామ్ పనిచేయడం లేదని పెద్ద ఎత్తున యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఇన్‌స్టాగ్రామ్‌కు చెందిన యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా మంది లాగిన్ అవలేకపోతున్నామని తెలియజేయగా, ఇంకొందరు ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేయలేకపోతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే యూజర్లు ట్విట్టర్ వేదికగా తమ అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ను ట్రోల్ చేయడంతోపాటు మీమ్స్ పెడుతున్నారు.
I legit thought my account is hacked and wifi is broken.. AGAIN #instagramdown pic.twitter.com/QY4XJxNRGa
— just for fun (@tpwk__luv) September 2, 2021
Since Instagram is down I’m just gonna camp here for a bit 🙂
Hi everyone 👋
— Scotty the hottie (@shy_scotty) September 2, 2021
#instagramdown again??? pic.twitter.com/7lDqh2pW4r
— carlee (@3ndellion) September 2, 2021
Ne demek #instagramdown pic.twitter.com/a03soyH1zD
— Yavuz (@yavoo4182) September 2, 2021
అయితే ఇన్‌స్టాగ్రామ్ దీనిపై స్పందించలేదు. కానీ సమస్య ఇంకా కొన్ని చోట్ల అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్ పనిచేయడం లేదంటూ యూజర్లు ట్విట్టర్‌లో పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి.