టాలీవుడ్ డ్రగ్స్ కేసు : నిందితుల ఇళ్లలో ఈడి సోదాలు..

టాలీవుడ్ డ్రగ్స్ నిందితుల ఇళ్లలో ఈడి సోదాలు సోదాలు చేపట్టింది. కెల్విన్ , కుద్దిస్, వాహిద్ ఇళ్లలో ఉదయం నుంచి సోదాలు చేసిన ఈడి… ముగ్గురు నిందితుల్ని ఈ డి కార్యాలయం కు తరలించారు అధికారులు. ముగ్గురిని వేరువేరుగా పెట్టి విచారణ చేస్తున్న ఈడి..ముగ్గురు నిందితులు ఇళ్లల్లో లాప్ టాప్, సెల్ ఫోన్ , ఎలక్ట్రానిక్ డివైస్ అన్నీ స్వాధీనపరుచుకుంది. ఉదయం 6 గంటలకు నిందితుడు కెల్విన్ ఇంటికి వెళ్ళిన సిఆర్పిఎఫ్ పోలీసులు.. ఈడి విచారణ కు రావాలని కెల్విన్ ను కోరారు.

ఏ నేపథ్యంలోనే నోటీస్ పై మొదట సంతకం చేసేందుకు నిరాకరించారు కెల్విన్. ఆ తర్వాత.. భార్య సూచన మేరకు సంతకం చేసి విచారణకు వెళ్లాడు కెల్విన్. ఇవాళ మద్యానం 2:10 కి కెల్విన్ ను ఈడి కార్యాలయానికి తీసుకొచ్చింది సిఆర్పిఎఫ్ సిబ్బంది. కెల్విన్ ఇంటికి సిఆర్పిఎఫ్ తో పాటు ఈడి అధికారులు వెళ్లారు. కెల్విన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు ఈడి అధికారులు. దాదాపు నాలుగు గంటల పాటు కెల్విన్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడి అధికారులు.. కెల్విన్ ల్యాప్ టాప్ తో పాటు మొబైల్, కొంత నగదు ను స్వాధీనం చేసుకున్నారు. మెహదిపట్నం దగ్గర మరో నిందితుడిని అదుపులోకి తీసుకుంది ఈడి. అతని ఇంటి నుండి 2 మొబైల్ ఫోన్ లతో పాటు ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు ఈడి అధికారులు..