తిరుమల శ్రీ వారి భక్తులకు టీటీడీ ఆలయ కమిటీ తీపి కబురు అందించింది. సర్వ దర్శనం టోకెన్ల జారీ పై టీటీడీ కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అలిపిరి వద్ద రోజు కి 2 వేల చోప్పున టోకెన్లు జారీ చేయాలని టిటిడి నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసుల కు టోకెన్లు జారీని పరిమితం చేయనుంది టిటిడి పాలక కమిటీ. సర్వ దర్శనం టోకెన్ల జారీ తో భక్తులకు కాస్త ఊరట లభించనుంది. కాగా కరోనా మహమ్మారి కారణంగా కొన్ని రోజులుగా సర్వదర్శనం టోకెన్ల జారీ ని టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే అక్టోబర్ 1 నుంచి అలిపిరి నడక మార్గంలో భక్తులను అనుమతించాలని నిర్నయం తీసుకుంది టీటీడీ పాలక కమిటీ. ఈ నెల 13 నుంచి తిరుమలలో అగరబత్తీలు భక్తులకు అందుబాటు లోకి వస్తాయని.. చెప్పింది టీటీడీ పాలక కమిటీ.