BREAKING : టాలీవుడ్‌ హీరో దాసరి అరుణ్ అరెస్ట్‌ !

-

టాలీవుడ్‌ హీరో దాసరి అరుణ్ అరెస్ట్‌ అయ్యాడు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన కేసులో హీరో దాసరి అరుణ్ ను అరెస్ట్‌ చేసినట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే.. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో దాసరి అరుణ్ కుమార్ ఉన్నారు.. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సయ్యద్ నగర్ లో ర్యాష్ డ్రైవింగ్ చేసిన దాసరి అరుణ్… ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఈరోజు తెల్లవారు జామున 4 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టినట్లు సమాచారం అందుతోంది.

డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన బంజారా హిల్స్ పోలీసులు… దాసరి అరుణ్ పై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే.. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో హాజరయ్యారు దాసరి అరుణ్ కుమార్. మరి కాసేపట్లోనే బ్రిదన్ అన లైస్ పరీక్షలు నిర్వహించనున్నారు బంజారా హిల్స్ పోలీసులు. ఈ పరీక్షలలో డ్రింక్‌ చేసినట్లు తేలితే.. కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version