ఒక్కటైన హీరో నాగశౌర్య-అనూష జంట

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య ఓ ఇంటి వాడయ్యాడు. కర్ణాటక కుందాపూర్‌కు చెందిన ప్రముఖ ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టిని ఆయన పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరులో ఓ స్టార్‌ హోటల్‌లో వీరి వివాహ వేడుక కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య వైభవంగా జరిగింది. ముందుగా నిశ్చయించిన సమయం ఉదయం 11.25గంటలకు నాగ‌శౌర్య నూతన వధువు అనూష మెడలో బంధు, మిత్రుల సమక్షంలో మూడు ముళ్లు వేశాడు.

వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ప్రీ వెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి కుమారుడిగా నాగశౌర్య తెల్లటి పంచ, షర్టులో సంప్రదాయంగా కనిపిస్తున్నాడు. అతడి భార్య అనూష ఎరుపు రంగు చీరలో బాపూ బొమ్మలా ముస్తాబైంది. నాగశౌర్య-అనూష జోడీ బాగుందంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

పెళ్లికి ముందు జరిపిన ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఈ జంట ట్రెడిషనల్‌ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోయారు. హల్దీ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించిన నాగశౌర్య కుటుంబం అనంతరం కాక్‌టైల్‌ పార్టీను కూడా ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో నాగశౌర్య తనకు కాబోయే భార్య అనూషకు రింగ్‌ తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news