బాలు మృతిపై టాలివుడ్ హీరోల స్పందన!

-

సినీ ప్రముఖులందరూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ గుండె బద్దలైనట్టుగా ఉందని అన్నారు. సంగీత ప్రపంచానికి ఇదొక చీకటి రోజని చెప్పారు. బాలుగారి మరణంతో ఒక శకం ముగిసిపోయిందని అన్నారు. అద్భుతమైన స్వరంతో తనకు ఎన్నో మధురమైన పాటలను బాలు అందించారని… తన విజయంలో ఆయన పాత్ర ఎంతో ఉందని చెప్పారు.

సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకుంటూ, సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. మహేశ్ బాబు స్పందిస్తూ… బాలుగారు ఇక లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నానని చెప్పాడు. ఆయనకు మరే గాయకుడు సాటి రాలేరని అన్నాడు. మా గుండెల్లో మీరు చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నాడు. బాలుగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పాడు. ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించాడు.

జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఆవేదన వ్యక్తం చేశాడు. ‘తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రంగా కలచివేసింది. ఈ భువిలో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే’ అని ట్వీట్ చేశారు.

రాంచరణ్ స్పందిస్తూ… ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉండే బాలుగారు మరణించారనే వార్తతో షాక్ కు గురయ్యానని చెప్పాడు. ఆయన లేని లోటును పూడ్చలేమని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి కుటంబసభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news