ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్ ను , అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా తెలిసి వుండాలి. లేదంటే మన బతుకు గేటు దగ్గరే వుండి పోతోంది. చాలా సార్లు టాలెంట్, అందం వున్నా కూడా ఏ అవకాశాలు రాక బాధపడుతూ ఉండి పోవలసి వస్తుంది.
కరెక్ట్ గా ఈ పరిస్థితిని కొందరు అనుకూలంగా మార్చుకొని అందమైన అమాయకమైన అమ్మాయిలకు అవకాశం ఇస్తామని బుట్టలో వేసుకుంటారు. మరి కొంత నటీ మణులు వారే సొంతంగా వాళ్ళకు కమిట్ మెంట్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకు డబ్భులు, అవకాశాలు వస్తాయి. వాళ్ళు తెలివిగా షూటింగ్ జరిగేటప్పుడు చాలా పద్ధతిగా ఉంటారు. అంతే కాకుండా హైదరాబాద్ లో రొమాన్స్ చేయటానికి అస్సలు ఇష్టపడరు.
ఎందుకంటే వారి ముఖాలు అందరికీ తెలుసు . ఎందుకంటే ఎవరైనా చూస్తే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టి రచ్చ రచ్చ చేస్తారని తెలుసు. అందుకే ఈ మధ్య తెలుగు సినిమా సెలబ్రిటీలు మొత్తం బ్యాంకాక్, మలేషియా, వెళుతూ అక్కడ ప్రైవేట్ దీవులలో ఉన్న స్పెషల్ రిసార్ట్స్ లో ఎంజాయ్ చేసి మళ్లీ ఏమీ తెలియనట్లు చెరో ప్లైట్ కు వస్తున్నారు. అంతకు ముందు గోవా ఎక్కువుగా వెళ్లే వారు, ఈ పాన్ ఇండియా కల్చర్ వల్ల అందరకీ వారి గురుంచి తెలిసి పోతుంది. అబ్బా పెద్ద కష్టమే వచ్చింది గురూ. అందుకే ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు.