అదిరింది బాసూ: RRR పై స్పైడర్ మ్యాన్ ప్రశంసలు..

-

రాజమౌళి డైరెక్టర్ గా మరియు జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన ఎంతో అద్భుతమైన దృశ్య కావ్యంగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఎందరో దర్శకులు, నిర్మాతలు, సినీ నటుల ప్రశంసలను అందుకుంది. తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమాపై హాలీవుడ్ హీరో తన పొగడ్తలతో ముంచెత్తాడు. స్పైడర్ మ్యాన్ గా నటించిన హీరో టామ్ హాలండ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తనకు ఎంతో నచ్చిందని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఇండియా పర్యటనకు వచ్చిన హాలండ్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడారు. అంతే కాకుండా ఇండియా రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇక్కడ హాలండ్ చాలా మంది ప్రముఖులను కలిసినట్లుగా చెప్పారు.

ఈయన ఇండియా రావడం ఇదే మొదటిసారి కాగా, మరోసారి ఇండియా వెళ్లాలని ఉందని తెలపడం పట్ల ఇండియా గొప్పతనాన్ని గుర్తించాలని పలువురు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news