మామిడి పండ్లు తిన్న తర్వాత మొటిమలు రాకుండా ఉండాలంటే ఇలా చేసి తినండి

-

ఇది మామిడి పండ్ల సీజన్‌..అందరూ ఇష్టంగా తింటారు కదా.. అసలు మామిడి పండ్లు అంటే ఇష్టపడని వాళ్లు ఉంటారా..? అస్సలు ఉండరు. మామిడి పండ్లు తినేప్పుడు బానే ఉంటాయి కానీ తిన్నాకా కొందరికి కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి. వేడి చేయడం, సెగ్గడ్డలు రావడం, మొటిమలు ఇవన్నీ వస్తాయి. ముఖ్యంగా అమ్మాయిలుకు ఈ మొటిమలు ఎక్కువగా వస్తాయి. మామిడిపండ్లు తింటే అసలు మొటిమలు ఎందుకు వస్తాయి.? దానికి ఒక కారణం ఉంది.

 

మామిడి పండ్లు తింటే మొటిమలు ఏర్పడటానికి కారణం ఫైటిక్ యాసిడ్. ఇది శరీరాన్ని వేడి చేస్తుంది. మామిడి పండ్లు తిన్నా కూడా మొటిమలు రాకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. వాటిని తినడానికి ముందు రెండు గంటల పాటు నీళ్ళలో నానబెట్టుకుని తింటే మంచిది. అలా చేయడం వల్ల ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. అవి ఉత్పత్తి చేసే వేడి తగ్గిస్తుంది. మామిడిలో యాంటీ న్యూట్రీయెంట్ ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలను గ్రహించే శరీర సామర్థ్యానికి ఇది ఆటంకం కలిగిస్తుంది. ఇవి సాధారణంగా థర్మోజెనిసిస్‌కి కారణం అవుతాయి. ఇది శరీర ఉష్ణోగ్రతని పెంచుతుంది. అదే వాటిని తినడానికి ముందు కనీసం 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టడం వల్ల థర్మోజెనిక ప్రభావం తగ్గిపోతుంది.

నానబెట్టకుండా తినడం వల్ల మొటిమలు, అసిడిటీ, గుండెల్లో మంట వస్తాయి. వీటిని నీటిలో నానబెట్టడం వల్ల సహజ వేడి తగ్గి శరీరానికి, చర్మానికి సురక్షితంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం.. పిత్త దోషం ఉన్న వాళ్ళు మామిడి తినడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే వారి శరీరంలో అప్పటికే వేడి చాలా ఉంటుంది. మామిడి దాన్ని ఇంకా పెంచుతుంది. దీని వల్ల కొందరిలో గుండెల్లో మంట, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. అందుకే పిత్త దోషం ఉన్న వాళ్ళు మామిడి పండ్లు రోజుకి ఒకటి మాత్రమే పరిమితం చేయాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా చేయండి

మామిడి పండు తిన్న తర్వాత చర్మం మీద మొటిమలు రాకుండా ఉండాలంటే రెండు గంటల పాటు వాటిని నీటిలో నానబెట్టాలి.

మామిడి పండు తినడం వల్ల వచ్చే వేడిని తగ్గించేందుకు ఒక గ్లాసు డైరీ పాలు లేదా వీగన్ పాలు తాగితే మంచిది.పండిన మామిడి పండ్లను పెరుగుతో కలిపి అసలు తినకూడదు. ఇది పిత్త దోషాన్ని అసమతుల్యత చేస్తుంది. శరీరంలో వేడిని పెంచుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news