షాకింగ్; రేపటి నుంచి బ్యాంకులు బంద్…!

-

మీకు బ్యాంకింగ్ లో ఎక్కువ అవసరాలు ఉంటాయా…? బ్యాంకు కి వెళ్ళడం మీకు అత్యవసరమా…? అయితే మీకు ఒక బ్యాడ్ న్యూస్. ఈ నెల 31, ఫిబ్రవరి ఒకటి బ్యాంకుల బంద్. అవును నిజం.. రేపు ఎల్లుండి బ్యాంకులు ఉండవు మాస్టారు. ఎందుకంటే బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిపై బ్యాంకు లు ఆగ్రహంగా ఉన్నాయి.

ఈ ధోరణి నిరసిస్తూ రేపు ఎల్లుండు బ్యాంకులు బంద్ అన్నమాట. ఈ విషయాన్ని యునైటెడ్‌ ఫోరం ఫర్‌ బ్యాంకు యూనియన్స్‌ నేతలు తెలిపారు. రెండో తారీఖు ఆదివారం కాబట్టి మూడు రోజులు సెలవులు వచ్చాయి అన్నమాట. కాబట్టి బ్యాంకు పనులు ఏమైనా ఉంటే ఈ రోజే పూర్తి చేసుకుంటే మంచిది. బ్యాంకు ఉద్యోగులపై పని భారం తీవ్రంగా ఉన్నా సరే ప్రజల కోసం సేవలు అందిస్తున్నామని,

అయినా సరే ప్రభుత్వ యంత్రాంగం తమను పట్టించుకోకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. ఇక ప్రభుత్వం దిగి రాకపోతే మార్చ్ నెలలో 11, 12, 13 తేదీల్లో మరో సమ్మె చేస్తామని ప్రకటించారు. బ్యాంకుల సమ్మెతో ఖాతాదారులు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానంగా వ్యాపార సముదాయాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురు కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news