కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్‌

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో శుక్రవారం వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

top 10 covid 19 updates around the world on friday 26th june 2020

1. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 605 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 11,489కి చేరుకుంది. రాష్ట్రంలో కోవిడ్‌ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 146కి చేరుకుంది. మొత్తం 5,196 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 6,147 మంది చికిత్స పొందుతున్నారు.

2. కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును జూలై 15వ తేదీ వరకు పొడిగించారు. మార్చి 23వ తేదీ నుంచి ఆ సర్వీసులను నిలిపివేశారు. కానీ దేశీయ విమాన సర్వీసులు మాత్రం యథావిధిగా నడుస్తున్నాయి. ఇక ఆగస్టు 12వ తేదీ వరకు అన్ని రైళ్లను రద్దు చేశారు. కేవలం ప్రత్యేక రైళ్లను మాత్రమే నడపనున్నారు.

3. కరోనా వైరస్‌కు ఏడాదిలోపు వ్యాక్సిన్‌ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే ఓ కమిటీని ఆ సంస్థ ఏర్పాటు చేయనుంది.

4. శుక్రవారం దేశవ్యాప్తంగా 17,296 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,90,401కు చేరుకుంది. కొత్తగా 407 మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో మరణాల సంఖ్య 15,301కు చేరుకుంది. మొత్తం 2.8 లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు.

5. అస్సాంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో అక్కడ వచ్చే ఆదివారం నుంచి 2 వారాల పాటు లాక్‌డౌన్‌ విధించనున్నారు. అక్కడ మొత్తం 6,321 కరోనా కేసులు నమోదయ్యాయి. 9 మంది చనిపోయారు.

6. ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లో నిరుద్యోగుల కోసం ఆత్మ నిర్భర ఉత్తరప్రదేశ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌ పథకాన్ని ప్రారంభించారు. 4 ఐరోపా దేశాలకు సమానమైన జనాభా కలిగిన యూపీలో సీఎం యోగి కరోనాను బాగా కట్టడి చేస్తున్నారని మోదీ ఆయనను అభినందించారు.

7. జూన్‌ 26 నుంచి 29 తేదీల్లో మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్‌ రాష్ట్రాలకు కేంద్రం ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ నేతృత్వంలో ఓ బృందాన్ని పంపనుంది. వారు కోవిడ్‌ 19పై పోరాటం చేసేందుకు ఆయా రాష్ట్రాలకు సహకారం అందించనున్నారు. ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

8. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌తోపాటు ఆ నగరం చుట్టు పక్కల ఉన్న పలు ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపుల ద్వారా ర్యాండమ్‌గా శాంపిల్స్‌ను సేకరించి కరోనా టెస్టులు చేయనుంది. అందువల్ల 2 రోజుల పాటు కరోనా టెస్టులు చేయడం నిలిపివేశారు. హాస్పిటళ్లలో కరోనా టెస్టులు చేయడం కొనసాగుతుంది.

9. గిలియడ్‌ సైన్సెస్‌ అభివృద్ధి చేసిన యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెమ్‌డెసివిర్‌ను కరోనా ట్రీట్‌మెంట్‌కు ఉపయోగించవచ్చని యురోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ సూచించింది.

10. కరోనా నేపథ్యంలో ఢిల్లీలో జూలై 31వ తేదీ వరకు పాఠశాలలు మూసి ఉంటాయని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news