దేశవ్యాప్తంగా విధించిన కరోనా లాక్డౌన్ వల్ల ఇండ్లలో ఉండే జనాలకు అస్సలు టైం పాస్ కావడం లేదు. దీంతో ప్రతి ఒక్కరూ తమ తమ ఇష్టాలకు అనుగుణంగా టైం పాస్ చేసేందుకు మార్గాలను వెదుక్కుంటున్నారు. అందులో భాగంగానే కొందరు అదే పనిగా సినిమాలు చూస్తుంటే.. మరికొందరు వెబ్ సిరీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కొందరు ఇండోర్ గేమ్స్ ఆడుతున్నారు. అలాగే చాలా మంది మొబైల్ గేమ్స్ ఆడడంలో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం కింద తెలిపిన 4 మొబైల్ గేమ్స్‌ను జనాలు ఎక్కువగా ఆడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఆ గేమ్స్ ఏమిటంటే…
1. పబ్జి మొబైల్ (PUBG Mobile)…
పబ్జి మొబైల్ గురించి పెద్దగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రస్తుతం చాలా మంది ఈ గేమ్‌ను ఆడుతున్నారు. ఒకేసారి ఈ గేమ్‌ను నలుగురు ఆడవచ్చు. రక రకాల గన్స్‌తో ఆన్లైన్లో ప్రత్యర్థులతో పోటీ పడవచ్చు. లాక్డౌన్ వల్ల చాలా మంది ఇప్పుడు ఈ గేమ్‌ను విపరీతంగా ఆడుతున్నారట. కనుక మీకు కూడా గన్స్, షూటింగ్ గేమ్‌లంటే ఆసక్తి ఉంటే ఈ గేమ్‌ను ఆడి చూడండి.. మంచి టైం పాస్ అవుతుంది.
2. ఫ్రీ ఫైర్ (Free Fire)…
ఇది కూడా పబ్జి మొబైల్ గేమ్ లాంటిదే. ఇందులోనూ పబ్జి తరహాలోనే గేమ్ ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ గేమ్‌ను కూడా చాలా మంది ఆడుతున్నారు. ఇది కూడా మల్టీ ప్లేయర్ గేమే.. పబ్జి నచ్చని వారు ఈ గేమ్‌ను ట్రై చేయవచ్చు.
3. లూడో (Ludo)…
ఈ గేమ్ ఒక రకంగా చెప్పాలంటే.. మనం ఎంతో కాలం నుంచి ఆడుతున్న అష్టా చెమ్మా ఆటే.. దీన్నే కొందరు పచ్చీస్ అని కూడా పిలుస్తారు. ఆన్లైన్లో నలుగురు ఈ గేమ్‌ను ఆడవచ్చు. అదే అష్టాచెమ్మా గీసి ఆడితే 8 మంది వరకు ఒకేసారి ఈ ఆట ఆడవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం లూడో గేమ్‌ను కూడా చాలా మందే ఆడుతున్నారు. ఇందులోనూ ఆన్లైన్ మల్టీ ప్లేయర్ ఆప్షన్ ఉంది.
4. క్యారమ్ బోర్డ్ (Carom Board)…
క్యారమ్ బోర్డు ఇండ్లలో లేని వారు.. ఆ గేమ్ ఆడాలనే ఆసక్తి ఉన్నవారు తమ తమ మొబైల్స్‌లో ఈ గేమ్‌ను ఆడుకోవచ్చు. మల్టీ ప్లేయర్ ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో పలు కంపెనీలు డెవలప్ చేసిన క్యారమ్ బోర్డు గేమ్ యాప్‌లు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో తమకు నచ్చిన క్యారమ్ గేమ్ యాప్‌ను వారు డౌన్లోడ్ చేసుకుని ఆడవచ్చు.