పుష్ప సినిమాలో విలన్ పాత్రలో ఒకప్పటి టాప్ కమెడియన్..?

-

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజిలో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పుష్ప సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు చాలా పేర్లు వినిపించాయి. కానీఎవ్వరూ ఫైనల్ కాలేదు. ఐతే తాజాగా పుష్ప సినిమాలో ఒకానొక టాప్ కమెడియన్ విలన్ గా కనిపించబోతున్నాడట.

కమెడియన్ గా సూపర్ సక్సెస్ అందుకున్న సునీల్, పుష్పలో ఒకానొక విలన్ పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. విలనీ చేష్టలతో వినోదం పుట్టించే పాత్రలో సునీల్ నటిస్తున్నాడట. ఈ మేరకు అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్, అక్కడ అపజయాలు పలకరించడంతో విలన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కలర్ ఫోటో సినిమాలో విలన్ గా మెప్పించాడు కూడా. మరి పుష్పలో సునీల్ విలన్ గా చేస్తున్నాడా లేదా తెలియాలంటే చిత్రబృందం స్పందించాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news