సూర్యుడి ఉపరితలంపై జరిగిన ఓ పరిణామం శాస్త్రవేత్తలను ఆకర్షిస్తుస్తుంది. భగభగలాడే సూర్యుడు ఖగోళ శాస్త్రవేత్తలకు అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. సూర్యుడి ఉపరితలంపై అతిపెద్ద భాగం విచ్ఛిన్నమైపోయి, సూర్యుడి ఉత్తరధృవం వైపు టోర్నడో తరహాలో సుడిగాలిని సృష్టించింది. ఇది ఎలా ఏర్పడిందన్న దానిపై శాస్త్రవేత్తలు విశ్లేషణ చేపట్టారు. సూర్యుడి ఉపరితలంపై ఏర్పడిన భారీ సుడిగాలికి సంబంధించిన వీడియో అంతరిక్ష పరిశోధన రంగం యావత్తూ ఇటువైపు చూసేలా చేసింది. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సూర్యుడిపై ఈ భారీ మార్పును పసిగట్టి చిత్రీకరించింది. అంతరిక్ష వాతావరణ నిపుణురాలు డాక్టర్ తమితా స్కోవ్ ఈ వీడియోను ట్విట్టర్ లో పంచుకున్నారు.
అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలను కలవరపెడుతున్న అంశం ఏమిటంటే… సూర్యుడు అప్పుడప్పుడు భారీ అగ్నికీలలను విరజిమ్ముతుంటాడు. వీటి ప్రభావం భూమ్మీద ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థలపై పడుతుంటుంది. అందుకే, తాజాగా సూర్యుడిపై చెలరేగిన సుడిగాలి ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందోనన్న ఆందోళన శాస్త్రవేత్తల్లో కలుగుతోంది. తాజాగా సూర్యుడి ఉపరితలంపై జరిగిన ఈ పరిణామం పరిశోధకులను విశేషంగా ఆకర్షిస్తోంది.