తోషిబా నుంచి నూత‌న స్మార్ట్ టీవీలు.. ధ‌ర రూ.12,990 నుంచి ప్రారంభం..

జ‌పాన్‌కు చెందిన ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ కంపెనీ తోషిబా భార‌త్‌లో నూత‌న స్మార్ట్ టీవీల‌ను లాంచ్ చేసింది. కొత్త‌గా 7 టీవీల‌ను మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. ఇవి 32 ఇంచులు మొద‌లుకొని 65 ఇంచుల డిస్‌ప్లే సైజుల్లో ల‌భిస్తున్నాయి. యూహెచ్‌డీ యు79, యూహెచ్‌డీ యు50, స్మార్ట్ ఎల్‌50 సిరీస్‌ల‌లో ఈ టీవీలు అందుబాటులో ఉన్నాయి.

toshiba launched new smart tvs with the initial pricing of rs 12990

యూహెచ్‌డీ సిరీస్ టీవీల్లో తోషిబాకు చెందిన సెవో 4కె హెచ్‌డీఆర్ ఇంజిన్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల పిక్చ‌ర్ క్వాలిటీ బాగుంటుంది. అలాగే డాల్బీ విజ‌న్‌కు స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. డాల్బీ అట్మోస్ ఆడియో ఫీచ‌ర్ ఉంది. వీటిల్లో అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ను ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు.

ఎల్‌50 సిరీస్ టీవీల‌లో ఏడీఎస్ ప్యానెల్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల టీవీని ఏ యాంగిల్‌లో చూసినా పిక్చ‌ర్ క్వాలిటీ బాగుంటుంది. అలాగే ఈ టీవీల్లో డాల్బీ ఆడియోను అందిస్తున్నారు.

తోషిబా 65 ఇంచుల 4కె టీవీ ధ‌ర రూ.66,990 ఉండ‌గా, 55 ఇంచుల 4కె టీవీ ధ‌ర రూ.46,990గా ఉంది. అలాగే 55 ఇంచుల మ‌రో మోడ‌ల్ టీవీ ధ‌ర రూ.36,990 ఉండ‌గా, 50 ఇంచుల టీవీ ధర రూ.32,990గా, 43 ఇంచుల టీవీ ధ‌ర రూ.27,990గా ఉంది. మ‌రో 43 ఇంచుల మోడ‌ల్ టీవీని రూ.22,490కి విక్ర‌యిస్తున్నారు. అలాగే 32 ఇంచుల టీవీ ధ‌ర రూ.12,990గా ఉంది. వీటిని సెప్టెంబ‌ర్ 18 నుంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, రిల‌య‌న్స్ డిజిట‌ల్‌, టాటా క్లిక్ స్టోర్‌ల‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.