భారీగా వరద నీరు.. నాగార్జునసాగర్ 16 క్రస్ట్ గేట్లు ఎత్తివేత..!

-

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 16 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 2,76,834  క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 2,76,834 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 589.30 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 309.9534 టీఎంసీలుగా ఉంది.

కాగా, ఇప్పటికే శ్రీశైలం డ్యాం 10 గేట్లను తెరిచి 3,11,586 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో నాగార్జునసాగర్ కు మరింత నీరు చేరుకుంటుంది. పైనున్న రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం డ్యాంకు భారీగా వరద చేరుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news