పుట్టగొడుగుల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

-

సీజన్లో దొరికే పండ్లు, కూరగాయలను తినడం ఎంతో మందికి అలవాటు. అయితే వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొన్ని పండ్లు ఆరోగ్యంతో పాటు అందంగా ఉండేలా కూడా చేస్తాయి. అయితే ఈ వర్షాకాలంలో దొరికే పుట్టగొడుగులను తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ పుట్టగొడుగులు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అవి ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం…

పుట్టగొడుగులు వాస్తవానికి శిలీంద్రాలు. అయితే వీటిని వంటలలో వాడుతారు. పుట్టగొడుగులలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.

పుట్టగొడుగులలోని యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులు, ప్రొస్టేట్ ఇంకా రొమ్ము క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడుతుందని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తెలిపింది.

పుట్టగొడుగుల లోని ఫైబర్, పొటాషియం, గుండె ఆరోగ్య పనితీరును మెరుగుపరుస్తాయి. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా హృదయ సంబంధ వ్యాధులను అరికడుతుంది.

గర్భధారణ సమయంలో పిండంలోని శిశువు పెరుగుదలకు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అయితే పుట్టగొడుగులను తినడం వల్ల పోలెట్ విరివిగా లభిస్తుంది.

ఇందులో ఉన్న ఖనిజాలు శరీరంలోని రక్తకణాలను తయారు చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇవి శరీరమంతా ఆక్సిజన్ సరఫరా చేయడానికి దోహదం చేస్తాయి.

ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉన్న ఫ్రీరాడికల్స్ దెబ్బతినకుండా, శరీరాన్ని రక్షిస్తాయి. అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. పుట్టగొడుగులలో సెలీనియం అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా దొరుకుతుంది.

బీటా గ్లూకగాన్ అనేది కరిగే డైటరీ ఫైబర్ యొక్క రూపము. ఇది మీ శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రి టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

చూశారు కదా.. పుట్టగొడుగుల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనలో.. మరి ఇంకేందుకు ఆలస్యం నెలకు ఒకసారైనా ఈ పుట్టగొడుగులను తినండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news