తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. సోషల్ మీడియాలో వేదికగా ఎవరైనా సహాయం కోరితే… వెంటనే స్పందిస్తారు మంత్రి కేటీఆర్. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రజల కోరిక మేరకు ప్రతి ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు తేవాలని మంత్రి కేటీఆర్ సూచనలు చేశారు.
నగర వాసుల సందర్శ నకు అనుకూలంగా ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని హైదరాబాదు సీపీ కి సూచించారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ వాసుల ట్విట్టర్ విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్… హైదరాబాదు సీపీ కి సూచించారు. సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ డైవర్షన్ ఉండాలని ఓ నెటిజన్ ఇచ్చిన సలహాకు మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సలహా చాలా మంచిదని.. ట్యాంక్ బండ్ అందాలను ఆస్వాదించడానికి అనుకూలంగా ఉండేలా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటే బాగుంటుందని మంత్రి కేటీఆర్ కూడా అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు హైదరాబాదు సీపీ ని ట్యాగ్ చేస్తూ… మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే.. దీనిపై సీపీ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
Good suggestion 👍 Request @CPHydCity to consider & plan with your team on implementation https://t.co/4OBWtdV14z
— KTR (@KTRTRS) August 24, 2021